Jagan: ‘కరోనా’ పరీక్షలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేయొద్దు: సీఎం జగన్
- ‘కరోనా‘ నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష
- పరీక్షలు నిర్వహించే సంఖ్యను క్రమంగా పెంచాలి
- క్యాన్సర్, డయాలసిస్ వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఏపీలో ‘కరోనా‘ నివారణా చర్యలపై సీఎం జగన్ ఈ రోజు సమీక్షించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, ఇప్పటివరకు మొత్తం 48,034 పరీక్షలు చేశామని జగన్ కు అధికారులు తెలిపారు. కొరియా నుంచి తెప్పించిన కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని, నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ర్యాపిడ్ టెస్టు కిట్లతో ఇప్పటి వరకూ 14,423 పరీక్షలు చేశామని చెప్పారు.
కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను జగన్ అభినందించారు. ‘కరోనా’ పరీక్షలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేయొద్దని, పరీక్షలు నిర్వహించే సంఖ్యను క్రమంగా పెంచాలని సూచించారు. క్యాన్సర్, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అత్యవసర కేసులకు, డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని ‘104’ కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని అన్నారు. ఏపీలో ప్రతిపాదిత వైద్య కళాశాలలకు వెంటనే స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు ‘1902’కు కాల్ చేయాలని సూచించారు.