sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 484 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 127 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- మార్కెట్లను నడిపించిన ఐటీ, టెక్, బ్యాంకెక్స్ సూచీలు
- 8.59 శాతం లాభపడ్డ కోటక్ మహీంద్రా బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల ప్రభావాలు, క్రూడాయిల్ ధరలు మళ్లీ గాడిన పడుతుండటం వంటిని ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 484 పాయింట్లు లాభపడి 31,863కి పెరిగింది. నిఫ్టీ 127 పాయింట్లు పుంజుకుని 9,314కి ఎగబాకింది. ఐటీ, టెక్, బ్యాంకెక్స్ సూచీలు మంచి లాభాలను ఆర్జించాయి
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (8.59%), ఇన్ఫోసిస్ (5.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.61%), ఓఎన్జీసీ (2.98%).
టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-4.18%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.59%), ఎన్టీపీసీ (-2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.32%).