Twitter: షారూక్‌ను దాటేసిన సల్మాన్ ఖాన్

salman khan beats shahrukh khan with 40 millions followers in twitter
  • ట్విట్టర్లో 40 మిలియన్ల  ఫాలోవర్లతో రికార్డు
  • ఇండియా సెలబ్రిటీల్లో రెండో స్థానానికి
  • 41.49 మిలియన్ల ఫాలోవర్లతో అమితాబ్‌ అగ్రస్థానం
బాలీవుడ్  కండల వీరుడు సల్మాన్ ఖాన్  సరికొత్త రికార్డు సృష్టించాడు. కింగ్ ఖాన్ షారూక్‌ ఖాన్‌ను దాటేశాడు. అది సినిమా కలెక్షన్లలో కాదు. ట్విట్టర్ ఫాలోవర్లలో. సల్మాన్‌ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4 కోట్లు దాటింది. దాంతో, ఇండియాలో 40 మిలియన్ల  (4 కోట్లు) ఫాలోవర్స్ కలిగిన రెండో సెలబ్రిటీగా నిలిచాడు.

ప్రస్తుతం 41.49 మిలియన్ల  ఫాలోవర్లతో బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సల్మాన్ తర్వాత షారూక్ ఖాన్ 39.9 మిలియన్ల ఫాలోవర్లతో మూడో  స్థానంలో ఉన్నాడు. సల్మాన్  ప్రస్తుతం ‘కబీ ఈద్ కబీ దివాలి’,  ‘బుల్బుల్ మ్యారేజ్ హాల్‌’,  ‘రాధే’ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడడంతో సల్మాన్ ఇప్పుడు ముంబైలోని తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు.
Twitter
followers
Salman Khan
40 millions
sharukh khan

More Telugu News