Vijay Sai Reddy: దోచుకునే చాన్స్ లేదని గాలికి వదిలేశాడు: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy slams TDP Chief Chandrababu in the wake of corona pandemic
  • విజన్ 2020 పేరుతో డప్పుకొట్టుకున్నాడంటూ బాబుపై విమర్శలు
  • సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యలు
  • సోది తప్ప సాధించిందేమీలేదని ఎద్దేవా 
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నిత్యం ఏదో ఒక అంశంలో చంద్రబాబును విమర్శించే విజయసాయి ఈసారి వైద్యరంగం నేపథ్యంలో ట్వీట్ చేశారు. విజన్ 2020 పేరుతో డప్పుకొట్టుకున్న బాబు రాష్ట్రంలో కనీసం నాలుగైదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఉంటే కరోనా నేపథ్యంలో ఎంతో ఊరట కలిగేదని వ్యాఖ్యానించారు. తన హయాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల సోది తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. దోచుకునే అవకాశం లేదని మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని గాలికి వదిలేశాడని ఆరోపించారు.
Vijay Sai Reddy
Chandrababu
Vision 2020
Corona Virus
COVID-19

More Telugu News