Nara Lokesh: నేతన్నలపై ఏపీ ప్రభుత్వం దయచూపుతుందని ఆశిస్తున్నా: నారా లోకేశ్
- లాక్ డౌన్ తో చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు
- ‘ఆప్కో’ ద్వారా సిద్ధంగా ఉన్న స్టాక్ ను కొనుగోలు చేయాలి
- ప్రతి కుటుంబానికి రూ.15 వేల సాయం అందించాలి
లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరో 81 వేల పవర్ లూమ్ కార్మికులపైనా లాక్ డౌన్ ప్రభావం చూపిందని, వారి జీవన విధానం దెబ్బతినడమే కాకుండా తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముడుగాక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
‘ఆప్కో’ ద్వారా నేతన్నల వద్ద తయారై సిద్ధంగా ఉన్న స్టాక్ ను వెంటనే కొనుగోలు చేయాలని, లాక్ డౌన్ సమయంలో వీరంతా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున ప్రతి కుటుంబానికి రూ.15 వేల సాయం అందించాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో నేతన్నల పట్ల ప్రభుత్వం దయచూపుతుందని ఆశిస్తున్నానంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.