Shriya: చెప్పే కథ ఒకటి... తీసే కథ మరొకటి!: శ్రియ ఆరోపణ

This is the reason for not committing films says Shriya
  • దర్శకనిర్మాతలు మోసం చేస్తున్నారు
  • అలాంటి వారికి నో చెబుతున్నా
  • సినిమాలో ప్రాధాన్యత ఉంటేనే స్పెషల్ సాంగ్ చేస్తా
తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రియ... పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయింది. తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. పెళ్లైన తర్వాత కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో శ్రియ నటించింది. అయితే, మంచి కథ దొరికితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని అంటోంది. వచ్చిన పాత్రలన్నింటినీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇదే కాకుండా మరో కారణం కూడా ఉందని... దర్శకనిర్మాతలు కొందరు మోసం చేస్తున్నారని ఆరోపించింది. చెప్పే కథ ఒకటి... తీసే కథ మరొకటని మండిపడింది. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువవుతున్నాయని చెప్పింది.

ఒకటి రెండు లైన్ల కథ చెప్పి, మోసం చేయాలనుకునే వారికి 'నో' చెబుతున్నానని శ్రియ తెలిపింది. స్పెషల్ సాంగ్స్ చేసేందుకు హీరోయిన్లు భయపడే సమయంలో వాటిని తాను చేశానని చెప్పింది. ఇలాంటి పాటల్లో నటిస్తే హీరోయిన్ గా అవకాశాలు రావేమోనని హీరోయిన్లు భయపడేవారని... ఆ భయాలను పారద్రోలాలని తాను అనుకున్నానని తెలిపింది. అయితే తాను స్పెషల్ సాంగ్ చేయాలంటే... సినిమాలో ఆ పాటకు చాలా ప్రాధాన్యత ఉండాలని చెప్పింది. సినిమాకు ఆ పాట ప్లస్ కావాలని, అప్పుడే ఆ పాట చేస్తానని స్పష్టం చేసింది.
Shriya
Marriage
Film Offers
Special Songs
Tollywood

More Telugu News