Vijayawada: కృష్ణలంక లారీ డ్రైవర్ నుంచి పలువురికి కరోనా.. వణుకుతున్న జనం!

Vijayawada scared of lorry driver
  • కోల్ కతాకు వెళ్లొచ్చిన డ్రైవర్ కు కరోనా
  • నిన్నటి వరకు ఆయన ద్వారా మరో 8 కేసులు
  • ఈరోజు ఆ ప్రాంతంలో మరో 18 కేసులు నమోదు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి. 272 కేసులతో కర్నూలు, 209 కేసులతో గుంటూరు, 127 కేసులతో కృష్టా జిల్లాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని  విజయవాడలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని కృష్ణలంకకు చెందిన ఓ లారీ డ్రైవర్ అందరికీ దడ పుట్టిస్తున్నాడు.

కోల్ కతాకు వెళ్లొచ్చిన కృష్ణలంక లారీ డ్రైవర్ కు కరోనా సోకింది. నిన్నటి వరకు ఆయన ద్వారా మరో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు జిల్లాలో కొత్తగా నమోదైన 25 కేసుల్లో 18 కేసులు కృష్టలంకలోనే నమోదయ్యాయి. దీంతో, ఆ ప్రాంతంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో... అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Vijayawada
Lorry Driver
Corona Virus
Krishnalanka

More Telugu News