Andhra Pradesh: ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా పరీక్షలు.. జాబితా ఇదిగో!

Thousands of corona tests conducted in AP districts
  • రాష్ట్రంలో 1,000 దాటిన కరోనా కేసులు
  • అన్ని జిల్లాల్లో కలిపి 61,266 టెస్టులు
  • అత్యధికంగా విశాఖ జిల్లాలో 8,141 టెస్టులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 61 మందికి కరోనా నిర్ధారణ కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కి చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో కలిపి 61,266 కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో  8,141 పరీక్షలు చేయగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1,806 టెస్టులు చేసినట్టు అధికార వర్గాలు వివరించాయి.
Andhra Pradesh
Corona Virus
Samples
Tests
Districts

More Telugu News