Jawahar Reddy: కరోనా పరీక్షల సగటు రేటు ఏపీలోనే ఎక్కువ: ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి

Jawahar Reddy tells corona details in a press meet
  • దేశంలో ప్రతి 10 లక్షల మందిలో సగటున 418 మందికి పరీక్షలు
  • ఏపీలో ఆ సగటు 1147
  • పాజిటివ్ కేసుల నమోదు రేటు ఏపీలో 1.66
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కరోనా వివరాలు తెలిపారు. దేశంలో ప్రతి 10 లక్షల మందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సగటు 418 అయితే, మన రాష్ట్రంలో ఆ సగటు 1147గా ఉందని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలకంటే ఏపీలోనే ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. నిర్వహించిన పరీక్షలతో పోల్చితే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నది మన రాష్ట్రంలోనే అని స్పష్టం చేశారు. పాజిటివ్ కేసుల అంశంలో జాతీయ సగటు 4.23 శాతం కాగా, ఏపీలో అది 1.66 మాత్రమేనని జవహర్ రెడ్డి తెలిపారు. పాజిటివ్ కేసుల సగటు మహారాష్ట్రలో 7.16గా ఉందని పేర్కొన్నారు.
Jawahar Reddy
Corona Virus
Andhra Pradesh
COVID-19
Positive Cases

More Telugu News