Maharashtra: మహారాష్ట్ర నుంచి నీటి ట్యాంకర్ లో తెలంగాణకు... నాందేడ్ లో విద్యార్థులను పట్టేసిన అధికారులు!
- మరాఠ్వాడా ప్రాంతంలో విద్యాభ్యాసం
- లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు
- లారీలో బయలుదేరగా, గుర్తించి క్వారంటైన్ చేసిన అధికారులు
ఎలాగైనా స్వస్థలాలకు చేరాలని భావించి, ఓ ఖాళీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తో డీల్ కుదుర్చుకుని మహారాష్ట్ర నుంచి బయలుదేరిన 20 మంది తెలంగాణ విద్యార్థులను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నాందేడ్ సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, మరాఠ్వాడా ప్రాంతంలో తెలంగాణకు చెందిన దాదాపు 20 మంది వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా, కళాశాలలకు సెలవులు ప్రకటించినా, అక్కడే ఉండిపోయారు. అక్కడ తినడానికి తిండిలేక అల్లాడిపోతూ, కాస్తంత ధైర్యం చేసైనా, తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని భావించారు.
ఓ లారీ డ్రైవర్ ను ఆశ్రయించి, ఖాళీ ట్యాంకర్ లోకి ఎక్కారు. దాదాపు 165 కిలోమీటర్ల దూరం వచ్చిన తరువాత, నాందేడ్ సమీపంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో దొరికిపోయారు. వీరందరినీ క్వారంటైన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.