RGV: లాక్‌డౌన్ వల్ల ఆల్కహాల్ దొరకకపోవడంపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు
- బ్లాక్ మార్కెట్‌లో ధరలు పెంచేస్తారు
- దీంతో మందుబాబుల కుటుంబాలు డబ్బును కోల్పోయే అవకాశం ఉంది
- నాయకులు ఆలోచించాలి
లాక్‌డౌన్‌పై స్పందిస్తూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకునే దేనినైనా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలను పెంచడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో తమకు కావాల్సిన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి మందుబాబులు డబ్బును అధికంగా ఉపయోగిస్తారని తెలిపారు.
దీంతో వారి కుటుంబాలు ఇతర అవసరాలను కొనుగోలు చేసే డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఆల్కహాల్ లేకపోవడంతో కొందరిలో పెరిగిపోతోన్న ఫ్రస్టేషన్ స్థాయి గురించి నాయకులు ఆలోచించాలని ఆయన కోరారు. దేశంలో విమాన సేవలు లేకపోవడంతో కొందరిలో కోపం పెరిగిపోతోందని, కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులతో పరిపాలన విభాగాలపై కోపంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆల్కహాల్‌కి కరోనాకు సంబంధం లేదని ట్వీట్లు చేశారు.