Lockdown: యూట్యూబ్‌లో చూసి క్యారెట్‌ బీర్‌ తయారు చేసి అమ్ముతున్న యువకుడు అరెస్టు

youth sells caret beer

  • చెన్నైలో ఘటన
  • తిరుచ్చినాంకుప్పంలో యువకుడు క్యారెట్‌ బీర్‌ విక్రయం
  • రెండు లీటర్ల క్యారెట్‌ బీర్‌ స్వాధీనం  
  • ఓ రసాయన పౌడర్‌ను చేర్చి తయారీ

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరకకపోవడంతో మందుబాబులు బ్లాక్ మార్కెట్‌లో మందు కొనాలని ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు అక్రమంగా మద్యం తయారు చేసి అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం మద్యం తయారీ విధానాన్ని తెలుసుకుని మరీ ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో ఓ వ్యక్తి క్యారెట్‌ బీరును తయారు చేసి విక్రయిస్తుండగా అతనిని పోలీసులు అరెస్టు చేశారు. అతని పేరు సుకుమార్‌ (25) అని వివరించారు.
 
అతను యూట్యూబ్‌లో చూసి క్యారెట్‌ బీర్‌ను తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనిది తమిళనాడులోని తిరుచ్చినాంకుప్పం ప్రాంతమని, ఆ ప్రాంతంలో ఎవరో క్యారెట్‌ బీర్‌ తయారు చేస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో గస్తీ చేపట్టడంతో అతను దొరికిపోయాడని పోలీసులు చెప్పారు. సుకుమార్‌ నుంచి రెండు లీటర్ల క్యారెట్‌ బీర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈస్ట్‌ అనే రసాయన పౌడర్‌ను చేర్చి రెండు రోజులు మగ్గపెట్టి, అనంతరం దాన్ని తాగితే మత్తు వస్తుందన్న విషయాన్ని అతను యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడని పోలీసులు తేల్చారు.

  • Loading...

More Telugu News