Talasani: తెలంగాణలో కిలో మటన్ రూ.700 కంటే ఎక్కువ ధరకు అమ్మొద్దు : మంత్రి తలసాని ఆదేశం
- కల్తీ మాంసం అమ్మకాలపై ఆగ్రహం
- మటన్ ధరలు పెంచినా, అందులో బీఫ్ కలిపినా చర్యలు
- అధిక ధరలకు విక్రయిస్తే 9848747788 కు ఫిర్యాదు చేయాలి
తెలంగాణలో కల్తీ మాంసం అమ్మకాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మటన్ ధరలు పెంచినా, అందులో బీఫ్ కలిపినా కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. మాంసం దుకాణాలపై రైడ్స్ నిర్వహించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. మటన్ కిలో రూ.700 కంటే ఎక్కువ ధరకు అమ్మొద్దని ఆదేశించారు. మటన్, చికెన్ లను అధిక ధరలకు విక్రయిస్తే కాల్ సెంటర్ నెంబర్ 9848747788 కు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు.