punjab: రాజస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఏడు బస్సులు పంపిన పంజాబ్ సీఎం
- నేడు రాష్ట్రానికి చేరుకోనున్న 150 మంది విద్యార్థులు
- జైసల్మేర్‌లో చిక్కుకున్న వారి కోసం 60 బస్సులు
- నాందేడ్‌కు మరో 80 బస్సులు
రాజస్థాన్‌లో చిక్కుకుపోయిన పంజాబ్ విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏడు బస్సులను పంపారు. రాజస్థాన్‌లోని కోటలో పంజాబ్‌కు చెందిన 150 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. విషయం సీఎం దృష్టికి రావడంతో స్పందించారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఏడు బస్సులను పంపారు.
ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్వీట్ చేశారు. వారంతా నేడు రాష్ట్రానికి చేరుకుంటారని తెలిపారు. అలాగే, జైసల్మేర్‌లోని 5 క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్న 2,700 మందిని కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు 60 బస్సులను పంపినట్టు పేర్కొన్నారు. నాందేడ్‌లో చిక్కుకున్న 219 మంది పంజాబ్ యాత్రికులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారని, మిగిలిన 643 మందిని తీసుకొచ్చేందుకు 80 బస్సులు పంపామని, నేడు అవి నాందేడ్ చేరుకుంటాయని సీఎం పేర్కొన్నారు.