Jitendra Singh: ఇండియాలో కరోనా కేసులే లేని ఐదు రాష్ట్రాలు... మరో మూడు రాష్ట్రాల్లో నమోదు కాని కొత్త కేసులు!

Five States in Northeast are Corona Free
  • జాబితాలో అరుణాచల్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ సిక్కిం
  • మిగతా మూడు రాష్ట్రాల్లో కనిపించని కొత్త కేసులు
  • వెల్లడించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
ఈశాన్య భారతావనిలోని ఐదు రాష్ట్రాలు కరోనా వైరస్ బారి నుంచి బయటపడినట్లేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా రహిత రాష్ట్రాలుగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, సిక్కింలు నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, మిగతా మూడు రాష్ట్రాలయిన మిజోరం, మేఘాలయా, అసోంలో కొత్త కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం చేపట్టిన చర్యల ఫలితంగానే ఈశాన్య ప్రాంతంలో మహమ్మారి ముప్పు తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో నిత్యావసరాలకు కొరత రాకుండా కార్గో విమానాలను వినియోగిస్తున్నామని ప్రాధాన్యతా క్రమంలో సరకులను చేరవేస్తున్నామని తెలిపారు. ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.
Jitendra Singh
Seven Sisters
India
Corona Virus

More Telugu News