Actor Prithviraj: నా వీడియోలు ఎడిట్ చేసి కించపరుస్తున్నారు.. పోలీసులకు సినీ నటుడు పృథ్వీరాజ్ ఫిర్యాదు

Actor Prithviraj Complaint against trolling by social media to Cyber crime police
  • హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
  • తన వీడియోలను ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆవేదన
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ప్రముఖ నటుడు, వైసీపీ నేత, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తన వీడియోలను కొందరు ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తనను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా టిక్‌టాక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో తన వీడియోలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Actor Prithviraj
Social Media
Trolling
Cyber Crime Police

More Telugu News