Corona Virus: కరోనా అప్ డేట్స్: హోమ్ ఐసొలేషన్ పై కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు జారీ!

Health ministry issues additional guidelines for home quarantine

  • క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలి 
  • అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలి
  • ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి

వైద్య పరీక్షల్లో తక్కువ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలిన వారిని లేదా ప్రీ-సింప్టమ్స్ కనిపిస్తున్న వారిని తొలుత హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

హోమ్ ఐసొలేషన్ ఎవరికి అవసరం?
  • వైద్య పరీక్షల్లో తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయిన వ్యక్తులు. లేదా ఏదైనా డాక్టర్ పరిశీలనలో కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించబడ్డ వ్యక్తులు. వీరంతా హోమ్ ఐసొలేషన్ లో ఉండాలి. వీరి కుటుంబ సభ్యులు కూడా ఐసొలేషన్ లో ఉండాలి.
  • వీరి మంచిచెడ్డలు చూసేందుకు అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలి. హోమ్ ఐసొలేషన్ సమయంలో హాస్పిటల్ కు, సహాయకుడికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి.

హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు పాటించాల్సినవి:
  • ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యుడి సలహా మేరకు సహాయకుడితో పాటు క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలి.
  • మొబైల్ లో ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఈ యాప్ యాక్టివ్ గా ఉండాలి.
  • ప్రతి పేషెంట్ తన ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకు, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా సర్వైలెన్స్ అధికారికి అందించేందుకు అంగీకరించాలి.
  • సెల్ఫ్ ఐసొలేషన్ కు సంబంధించిన ఫామ్ ను పూర్తి చేయాలి. హోమ్ క్వారంటైన్ గైడ్ లైన్స్ ను పాటించాలి.

  • Loading...

More Telugu News