Love Agarwal: ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉంది: లవ్ అగర్వాల్

Love Agarwal press meet

  • ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవు
  • దీనిపై ఐసీఎంఆర్ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది
  • ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దు

కరోనా వైరస్ బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు చేసే ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ‘కరోనా’ నివారణకు ఈ థెరపీ ఉపయోగపడుతుందన్న ఆధారాలు లేవని తెలిపారు.

దీనిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని, దీనికి ఆమోదం లభించే వరకు ప్లాస్మా థెరపీ పద్ధతి వద్దని తెలిపారు. ట్రయల్ పద్ధతిలో లేదా పరిశోధనల నిమిత్తమే ప్లాస్మా థెరపీని వినియోగించాలని సూచించారు. ‘కరోనా’ పేషెంట్ కు ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News