Talasani: లాక్ డౌన్ సడలింపుపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
- వలస కార్మికుల ప్రయాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ప్రకటన చేసి, చేతులు దులుపుకోవడం సరికాదన్న తలసాని
- కార్మికులు వెళ్లేందుకు రైళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్
లాక్ డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కొంత మేర సడలించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కేవలం సడలింపుల ప్రకటన చేసి, చేతులు దులుపుకోవడం సరికాదని విమర్శించారు. వలస కార్మికులు వాళ్ల ఊళ్లకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని... ఉచితంగా రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పారు.