Polavaram Project: ‘పోలవరం’ ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు నిధులు మంజూరు

Polavaram project
  • ‘పోలవరం’ పనులు వేగవంతం చేసే నిమిత్తం నిర్ణయం
  • దేవీపట్నంలోని ఆరు గ్రామాలకు నిధులు మంజూరు
  • రూ.79 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
పోలవరం ముంపు గ్రామాల ప్రజల తరలింపునకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ముంపు గ్రామాల పరిధిలోని దేవీపట్నం ప్రాంతంలో ఉన్న ఆరు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ కింద రూ.79 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే నిమిత్తం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ నిన్న సమీక్షించారు. గత ఏడాది సంభవించిన గోదావరి వరదల్లో ముంపునకు గురైన కుటుంబాలను తక్షణం తరలించాలని, వారికి పునరావాసం కల్పించే చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Polavaram Project
Devipatnam
Funds
Ap Government

More Telugu News