Mango: నేటి నుంచి మామిడిపళ్ల డోర్ డెలివరీ... ఫోన్ నంబర్, చెల్లింపు పద్ధతి వివరాలు!
- బంగిన పల్లి మామిడిని సరఫరా చేయనున్న ఉద్యాన శాఖ
- సహజ పద్ధతుల్లో మాగబెట్టి డెలివరీ
- 79977 24925, 79977 24941 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్
హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి నాణ్యమైన మామిడి పండ్లను అందించాలన్న సదుద్దేశంతో తెలంగాణ ఉద్యాన శాఖ నేటి నుంచి మామిడి పండ్ల ఆర్డర్ ను ఫోన్ ద్వారా స్వీకరించనుంది. నిత్యమూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ 79977 24925, 79977 24941 నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రాం రెడ్డి వెల్లడించారు. తోటల నుంచి పక్వానికి చేరిన దశలోని కాయలను సేకరించి, స్వయంగా సహజ పద్ధతిలో వాటిని మాగబెట్టి, ప్రజలకు అందించనున్నామని అన్నారు.
5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల కార్టన్ బాక్స్ ధర రూ. 350 (డెలివరీ చార్జీలు కలుపుకుని) నిర్ణయించామని ఆయన అన్నారు. వినియోగదారులు తమ ఆర్డర్ విలువను గూగూల్ పే, ఫోన్ పే ద్వారా 79977 24925 నెంబర్‌కు పంపించవచ్చని, నెట్ బ్యాంకింగ్ ను వినియోగించాలని భావించే వారు అకౌంట్ నెంబర్- 013910100083888 (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్‌డీబీ0000139) ఆంధ్రాబ్యాంక్, గగన్ మహల్ శాఖకు పంపాలని సూచించారు. ఆర్డర్ అందిన 4 నుంచి 5 రోజుల వ్యవధిలో డోర్ డెలివరీని తపాలా శాఖ ద్వారా అందిస్తామని తెలిపారు.