Corona Virus: దేశంలో కరోనా ఎప్పుడు అదుపులోకి రావచ్చో వెల్లడించిన అధ్యయనం
- భారత్లో మే 21 నాటికి కరోనా వైరస్ అదుపులోకి
- లాజిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో అంచనా
- మే 21 నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 24,222
భారత్లో మే 21 నాటికి కరోనా వైరస్ అదుపులోకి రావచ్చని ముంబై స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ పేర్కొంది. తాను చేసిన ఓ అధ్యయనం ద్వారా సదరు సంస్థ ఈ విషయంలో ఓ అంచనాకు వచ్చింది. లాజిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో భారత్లో కరోనా లెక్కలను అంచనా వేసి ఈ ఫలితాలు వెల్లడించారు. కరోనా వైరస్ మొదట విజృంభించి, గరిష్ఠ స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుతున్నట్లు వివిధ దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తే తెలిసిందని చెప్పారు.
ఈ లెక్కల ఆధారంగా భారత్లో కరోనా వ్యాప్తి రేటును బట్టి అధ్యయనం చేశామని వివరించారు. మే 21 నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 24,222కు చేరుతుంది. గుజరాత్లో 4,833 కేసులు ఉంటాయి. అప్పటికి కొత్త కేసుల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుందని తెలిపింది. ఈ వివరాలను 'ఎండ్ ఈజ్ నియర్' పేరిట ప్రచురించింది.