Buggana Rajendranath: చాలా గర్వంగా చెబుతాం.. ఏపీలో ఎక్కువ కరోనా కేసులు రావడానికి కారణం ఇదే: మంత్రి బుగ్గన

AP is in top place in controlling corona says Buggana

  • ఏపీలో కరోనా టెస్టింగ్ లు ఎక్కువగా చేస్తున్నాం
  • అందుకే కేసులు ఎక్కువగా వస్తున్నాయి
  • మూడు జిల్లాలు మాత్రమే హై రిస్క్ లో ఉన్నాయి

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రజలంతా సిద్ధం కావాలని, ఎలాంటి భయాలకు గురి కాకూడదని ముఖ్యమంత్రి జగన్ ముందు నుంచి చెబుతున్నారని అన్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు మాత్రమే హై రిస్క్ లో ఉన్నాయని... విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో రిస్క్ తక్కువగా ఉందని తెలిపారు.

ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ ద్వారా మాట్లాడుతూ అనవసరంగా విమర్శలు గుప్పిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. కుమారుడు నారా లోకేశ్ తో ట్వీట్లు చేయిస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నాయని అంటున్నారని... అక్కడ టెస్టింగ్ ఏ మేరకు జరుగుతోందని ప్రశ్నించారు. ఏపీలో టెస్టింగ్ ఎక్కువగా జరుగుతోందని, అందుకే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తాము గర్వంగా చెప్పగలమని అన్నారు.

గత 24 గంటల్లో నమోదైన కేసుల కంటే డిశ్చార్జి అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని... అంటే కేసులు తగ్గుముఖం పడుతున్నట్టే కదా? అని మంత్రి అన్నారు. కర్నూలులో కూడా వైరస్ ను కట్టడి చేసేందుకు అధికారులు అన్ని విధాల యత్నిస్తున్నారని చెప్పారు. త్వరలోనే కర్నూలులో కేసులు తగ్గుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News