Tablighi Jamaat: తబ్లిగీ జమాత్ చీఫ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కరోనా.. క్వారంటైన్ కు మరో 12 మంది!

2 police investigating Tablighi Chief tests corona positive

  • వైద్య పరీక్షల్లో ఇద్దరు పోలీసులకు కరోనా పాజిటివ్
  • కరోనా బారిన పడిన ఢిల్లీ పోలీసుల సంఖ్య 100 దాటిన వైనం
  • తబ్లిగీ చీఫ్ పై ఈడీ దర్యాప్తు కూడా ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారనే ఆరోపణలతో ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ కు చెందిన ఇద్దరు పోలీసులకు కరోనా సోకింది. వీరిద్దరికీ కరోనా లక్షణాలు కనిపించడంతో... వైద్య పరీక్షలు నిర్వహించగా... కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరితో పాటు క్రైమ్ బ్రాంచ్ టీమ్ లోని మరో 12 మందిని క్వారంటైన్ కు పంపించారు. వీరితో కలిపి ఢిల్లీలో కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 100 దాటింది.

మరోవైపు మౌలానా సాద్‌తోపాటు అతడి సన్నిహితుల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది రూపాయలు వచ్చి పడినట్టు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా తాము సేకరించిన వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందించారు. దీంతో ఈ సొమ్ము హవాలా మార్గంలో వచ్చిందా? లేక మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News