Corona Virus: యూపీలోని సొంత గ్రామానికి చేరుకున్న ఏడుగురు వలస కూలీలకు కరోనా!

7 UP Migrants Who Returned From Maharashtra Test Positive

  • మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు చేరిన కూలీలు 
  • క్వారంటైన్‌లో వుంచిన అధికారులు 
  • కరోనా నిర్ధారణ.. ఆసుపత్రికి తరలింపు
  • క్వారంటైన్‌ కేంద్రాన్ని శుభ్రం చేసిన సిబ్బంది

వలస కూలీలను ఇక సొంత ప్రాంతాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీకి చేరుకున్న వారిలో ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు కొందరు కూలీలు చేరుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, వారం రోజుల క్రితం యూపీలోని బస్తి జిల్లాకు కొందరు కూలీలు చేరుకున్నారు. వారిని ఓ కాలేజీలో క్వారంటైన్‌లో ఉంచారు. వారికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ రోజు స్థానిక కరోనా ఆసుపత్రికి తరలించారు. క్వారంటైన్ కేంద్రాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. ఆ ఏడుగురిని ఇటీవల కలిసిన వారిని కూడా ట్రేస్ చేసిన అధికారులు వారిని కూడా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు.

కూలీలను సొంత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కూలీలే కాకుండా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న విద్యార్థులు, యాత్రికులకు కూడా అధికారులు బస్సు, రైలు సదుపాయాలు కల్పిస్తూ సొంత ప్రాంతాలకు పంపుతున్నారు. ఇలాంటి సమయంలో యూపీలో ఏడుగురు కూలీలకు కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.  

  • Loading...

More Telugu News