Jacqueline Fernandez: లాక్ డౌన్ లో సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లో గడుపుతున్న జాక్వెలిన్

Jacqueline staying at Salman farmhouse during lockdown
  • స్నేహితులతో కలిసి పన్వేల్ ఫాంహౌస్ లో ఉంటున్న జాక్వెలిన్
  • రోజుకు రెండు సార్లు హార్స్ రైడింగ్ చేస్తున్న బాలీవుడ్ భామ
  • ఎక్కువగా వర్కౌట్స్ చేస్తున్నానని వ్యాఖ్య
క్షణం తీరిక లేకుండా గడిపే బాలీవుడ్ సెలబ్రిటీలకు లాక్ డౌన్ కారణంగా కావాల్సినంత ఫ్రీటైమ్ దొరికింది. ఇంటివద్ద, లేదా ఫాంహౌస్ లలో ఉంటూ వారు తమకు నచ్చిన పనులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. అందాల తార, శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముంబై సమీపంలోని పన్వేల్ ఫాంహౌస్ లో కొందరు స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ ఫాంహౌస్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ది కావడం గమనార్హం. మరోవైపు తన లాక్ డౌన్ అనుభవాలను జాక్వెలిన్ తన అభిమానులతో పంచుకుంది.

ఫాంహౌస్ లో ప్రతిరోజు రెండు సార్లు హార్స్ రైడింగ్ చేస్తున్నానని జాక్వెలిన్ తెలిపింది. గుర్రాలకు స్నానం చేయిస్తున్నానని, గుర్రపుశాలను శుభ్రం చేస్తున్నానని చెప్పింది. రోజురోజుకీ ఈ పనుల్లో ప్రావీణ్యం సంపాదిస్తున్నానని, అలాగే ఎక్కువగా వర్కౌట్స్ కూడా చేస్తున్నానని వెల్లడించింది. ఫాంహౌస్ లో పండుతున్న కూరగాయలతో సలాడ్స్ చేస్తున్నానని, ఫాంహౌస్ చాలా బాగుందని... ఇక్కడి నేచర్ అద్భుతంగా ఉందని చెప్పింది.

మరోవైపు, ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సల్మాన్ ఫాంహౌస్ లోనే జాక్వెలిన్ ఉండిపోయింది.
Jacqueline Fernandez
Bollywood
Salman Khan
Farmhouse
Lockdown

More Telugu News