Jagan: కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలంటూ అధికారులకు సీఎం జగన్ ఆదేశం!
- కరోనా నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష
- ప్రతి గ్రామసచివాలయం ఒక యూనిట్ గా తీసుకోవాలని వెల్లడి
- 15 మంది వరకు క్వారంటైన్ కు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టీకరణ
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికోసం అనుసరించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని, అందులో 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి ఏర్పాట్లు చేసుకోవాలని, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారే కాకుండా, విదేశాల్లో ఉన్నవారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసర రవాణా వాహనాలుగా మార్చాలని, మొబైల్ యూనిట్లలో మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు.