Indian Railways: ప్యాసింజర్ రైళ్లు రద్దు ఈ నెల 17 వరకు పొడిగింపు!

Cancellation of passenger train services extended says Indian Railways
  • లాక్ డౌన్ నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్ల రద్దు
  • శ్రామిక్ రైళ్లను మాత్రం నడుపుతామన్న రైల్వేస్
  • సరుకు రవాణా, పార్సిల్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని ప్రకటన
లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని ప్యాసింజర్ రైళ్ల ప్రయాణాలపై మే 17 వరకు నిషేధం ఉంటుందని ఇండియన్ రైల్వేస్ పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విన్నపాల మేరకు ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లినవారు తమ ప్రాంతాలకు చేరుకోవడం కోసం శ్రామిక్ రైళ్లను మాత్రం నడుపుతామని ప్రకటించింది. టికెట్ల బుకింగ్స్ కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావద్దని విన్నవించింది. సరుకు రవాణా, పార్సిల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Indian Railways
Passenger Trains
Sunspended

More Telugu News