Liquor: రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు... నిబంధనలివి!
- రేపటి నుంచి తెరచుకోనున్న మద్యం దుకాణాలు
- మాల్స్, మార్కెట్ ఏరియాల్లో ఉండే దుకాణాలను అనుమతించం
- భౌతికదూరం తప్పనిసరని కేంద్రం ఆదేశం
రేపటి నుంచి మూడో విడత లాక్ డౌన్ ను అమలు చేస్తూ, కొన్ని మినహాయింపులను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, మద్యం విక్రయాలపై మరింత స్పష్టతను ఇచ్చింది. రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లన్నింటిలో మద్యం విక్రయాలు కొనసాగించ వచ్చని స్పష్టం చేస్తూ, రెడ్ జోన్ల విషయంలో పరిమితులను విధించింది. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని, పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసిన కేంద్రం, మాల్స్ లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదని పేర్కొంది. దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరని, ఏ దుకాణం వద్ద కూడా అయిదుగురికి మించి ఉండరాదని పేర్కొంది. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు తెరిచేందుకు వీల్లేదని వెల్లడించింది.