Alla Nani: ఏపీలో ‘కరోనా’ కేసులు తగ్గు ముఖం పట్టాయి: మంత్రి ఆళ్ల నాని

Alla Nani press meet

  • ఇప్పటి వరకు  488 మంది డిశ్చార్జ్ అయ్యారు
  • వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు  
  • ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 పడకలు 

రాష్ట్రంలో నాలుగు రోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని ఏపీ   వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఇప్పటి వరకు ‘కరోనా’ నుంచి కోలుకుని 488 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా పరీక్షల సామర్థ్యం మరింత పెంచామని అన్నారు. వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 పడకలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బెడ్స్ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని నిబంధనలు సడలించే అవకాశం ఉందని, ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏపీ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని, టెలీ మెడి సిన్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రతి పీహెచ్ సీలో మందులు అందుబాటులో ఉంచుతున్నామని, మందుల సరఫరాలకు మోటారు వాహనం, కిట్ బ్యాక్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు.  

  • Loading...

More Telugu News