Chiranjeevi: రాధతో మళ్లీ స్టెప్పులు... వీడియో పంచుకున్న చిరంజీవి

Chiranjeevi dance again with yesteryear heroine Radha
  • ప్రతి ఏడాది కలుస్తున్న 80వ దశకం నటులు
  • ఈసారి చిరంజీవి నివాసంలో వేడుకలు
  • తన హీరోయిన్లతో డ్యాన్సులేసిన చిరంజీవి
80వ దశకంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటీనటులు ఎయిటీస్ క్లబ్ పేరిట ప్రతి ఏడాది ఓ ప్రాంతంలో కలుస్తుంటారు. చిరంజీవి, వెంకటేశ్, భానుచందర్, మోహన్ లాల్, సుహాసిని, రాధ, రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, జయప్రద, జయసుధ, లిజీ, రేవతి, సురేశ్ తదితరులు ఏదైనా ఒక హోటల్లోనో, రిసార్టులోనో కలుసుకుని కొన్నిరోజుల పాటు ఉల్లాసంగా గడుపుతారు.

ఇటీవలే వారందరూ హైదరాబాద్ లోని మెగాస్టార్ నివాసంలో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చిరంజీవి తాజాగా పంచుకున్నారు. అందులో ఒకప్పుడు తనతో పోటాపోటీగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులతో ఈలలు వేయించిన నటి రాధతో చిరు మళ్లీ స్టెప్పులేశాడు. రాధ కూడా ఎంతో ఉత్సాహంగా చిరంజీవితో కాలు కదిపి అందరినీ అలరించింది. రాధతోనే కాదు సుహాసిని, జయప్రద, ఖుష్బూ, జయసుధతో కూడా చిరు చిందేశాడు.
Chiranjeevi
Radha
Dance
80s Reunion
Tollywood

More Telugu News