Corona Virus: కరోనా పాజిటివ్ అని తేలడంతో క్యాన్సర్ పేషెంట్ డిశ్చార్జి

Cancer patient discharge after he tested corona positive
  • క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి
  • కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు
  • కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఎయిమ్స్ కు తరలింపు
ఢిల్లీలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న రోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఉత్తరాఖండ్ లోని చమన్ విహార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఏప్రిల్ 28న చికిత్స కోసం నగరంలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

అయితే కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో వైరస్ టెస్టు చేశారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో అపోలో వర్గాలు అతడ్ని డిశ్చార్జి చేశాయి. అతడికి కరోనా ఉందని తెలుసుకున్న అధికారులు రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించారు. అంతేకాదు, ఆ క్యాన్సర్ రోగి కుటుంబంలోని ఐదుగురిని ఐసోలేషన్ లో ఉంచారు. చమన్ విహార్ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధనం చేశారు.
Corona Virus
Positive
Cancer
Patient
AIIMS Rishikesh
New Delhi

More Telugu News