Lockdown: ఏపీలో వివిధ జోన్లలో సడలింపులు ఇలా!
- మాల్స్, సభలు, పార్కులు బంద్
- స్కూళ్లు, కాలేజీలో ఆన్ లైన్లోనే
- కంటైన్మెంట్లలో ఓపీడీ సేవల మెడికల్ క్లినిక్స్ బంద్
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఏపీలో నేటి నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల ఆంక్షలను సడలిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రెడ్ జోన్లలో కరోనా కట్టడి కోసం నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.
వివిధ జోన్లలో సడలింపుల వివరాలు:
కేటగిరి | కంటైన్మెంట్ క్లస్టర్ | రెడ్ జోన్ జిల్లాల్లో | ఆరంజ్ జోన్ జిల్లాల్లో | గ్రీన్ జోన్ లో |
ప్రార్థనా స్థలాలు, సభలు, హాల్స్, మాల్స్, పార్కులు | లేదు | లేదు | లేదు | లేదు |
స్కూళ్లు, కాలేజీలు | ఆన్ లైన్లో | ఆన్ లైన్లో | ఆన్ లైన్లో | ఆన్ లైన్లో |
అన్ని రకాల ప్రజా రవాణా | లేదు | లేదు | లేదు | లేదు |
ఓపీడీ సేవల మెడికల్ క్లినిక్స్ | లేదు | జాగ్రత్తలతో | జాగ్రత్తలతో | జాగ్రత్తలతో |
అంతర్రాష్ట్ర కార్గో / గూడ్స్ సేవలు | హైవే నిబంధనల మేరకు | తిరగొచ్చు | తిరగొచ్చు | తిరగొచ్చు |
సైకిల్ రిక్షాలు, ఆటోలు | లేదు | లేదు | తిరగొచ్చు | తిరగొచ్చు |
టాక్సీ / క్యాబ్ | లేదు | లేదు | 1 డ్రైవర్, 1 ప్యాసింజర్ | తిరగొచ్చు |
ప్రైవేట్ వాహనాలు | లేదు | 1 డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లు (కారు). టూవీలర్లపై ఒక్కరే | 1 డ్రైవర్, ఇద్దరు ప్యాసింజర్లు (కార్లు). టూవీలర్లపై ఇద్దరు | తిరగొచ్చు |