Migrant workers: వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులకు అమలు చేసే క్వారంటైన్ వివరాలు

Quarantine details of implementation for migrant workers in different states

  • దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ 
  • వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు
  • ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నిబంధనలు

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, పనుల నిమిత్తం వెళ్లిన వారు పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని రోజుల క్వారంటైన్  అమలు  చేస్తున్నారో వాటి వివరాలు..

- ఏపీలో.. కొవిడ్-19 పరీక్షలు నిర్వహించి.. టెస్టు రిపోర్టు వరకు రిలీఫ్ క్యాంప్ లో ఉంచుతారు. రిపోర్టులో ఫలితాన్ని అనుసరించి క్వారంటైన్ నిర్ణయిస్తారు.

- తమిళనాడులో.. కొవిడ్ 19 పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తారు. రిపోర్టు వచ్చే వరకు ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు. ‘కరోనా’ నెగిటివ్ వస్తే 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.

- కర్ణాటకలో.. 14 రోజుల హోం క్వారంటైన్

- కేరళలో.. 14 రోజుల హోం క్వారంటైన్

- ఒడిశాలో.. పట్టణాల్లో 14 రోజుల హోం క్వారంటైన్. అదే  గ్రామాల్లో అయితే ప్రభుత్వం చెప్పిన కేంద్రాల్లో 14 రోజుల క్వారంటైన్

- మధ్యప్రదేశ్ లో.. 14 రోజుల హోం క్వారంటైన్

- రాజస్థాన్ లో.. 14 రోజుల హోం క్వారంటైన్

- బీహార్ లో..21 రోజుల క్వారంటైన్

- జమ్మూ కశ్మీర్ లో.. ప్రభుత్వ అనుమతితో వచ్చే వారికి 14 రోజుల ప్రభుత్వ క్వారంటైన్. అనుమతి లేకుండా వస్తే 21 రోజుల క్వారంటైన్.

  • Loading...

More Telugu News