Corona deaths: కోవిడ్ మరణాల రేటులో పశ్చిమ బెంగాల్ టాప్!
- రాష్ట్రంలో 12.8 శాతంగా ఉన్న మరణాలు రేటు
- సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్న కేంద్ర బృందం
- మమత, గవర్నర్ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాలతో పోలిస్తే, పశ్చిమ బెంగాల్లోనే మరణాల రేటు ఎక్కువగా ఉందని కేంద్ర బృందం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా క్షేత్రస్థాయి పరిశీలన ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో అంతర మంత్రిత్వశాఖల కేంద్రం బృందం తెలిపింది.
దేశంలోనే అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 12.8 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ఆ లేఖలో కేంద్ర బృందం నేత అపూర్వ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ దన్ఖర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మమత పోలీసు పాలన సాగిస్తున్నారని, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలని గవర్నర్ హితవు పలికారు.