Mumbai: ముంబైలో కఠిన చర్యలు.. రోడ్డెక్కితే జైలుకే!
- ముంబైలో సెక్షన్ 144
- మే 17 వరకు అమలు
- రోడ్డెక్కితే 6 నెలలు జైలే
మహారాష్ట్రలో కరోనా రక్కసి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై మహా నగరం ఈ మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దీని ప్రభావం తగ్గడం లేదు. కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో మే 17 వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించింది.
వైద్యం కోసం తప్ప వేరే ఇతర పనుల కోసం రోడ్లపైకి రావద్దని మహా ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే... 6 నెలల పాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. రాత్రి వేళల్లో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.