WHO: కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు: డబ్ల్యూహెచ్ఓ

WHO envoy says there may be no corona vaccine forever

  • ప్రయోగశాలల్లో వివిధ దశల్లో 100 వ్యాక్సిన్లు
  • అనేక వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదన్న ప్రత్యేక ప్రతినిధి
  • ప్రయోగాలు ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయని వెల్లడి

ప్రపంచ మానవాళికి ప్రబల శత్రువుగా పరిణమించిన కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తోంది.  ప్రయోగశాలల్లో  ఇప్పటికే 100 వరకు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చని అన్నారు. చాలా రకాల వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని, కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ ను నిలువరించే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రయోగాల కారణంగా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నా, చప్పున చల్లారిపోతున్నాయని, అంతిమంగా అన్నీ ఈ వైరస్ ముందు దిగదుడుపేనని డాక్టర్ నబర్రో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News