Andhra Pradesh: ఏపీలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ రేటు ఎంత పెరిగిందంటే..!
- ఏపీలో 75 శాతం పెరిగిన మద్యం ధరలు
- భారీగా పెరిగిన ఫారిన్ లిక్కర్ రేటు
- రూ. 150 కంటే ఎక్కువ ఉన్న క్వార్టర్ ధరపై రూ. 120 పెంపు
ఏపీలో మద్యం ధరలు చుక్కలను అంటాయి. మద్యపాన నిషేధంలో భాగంగానే ధరలను పెంచుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మొన్న మద్యం ధరలను 25 శాతం పెంచగా... నేడు మరో 50 శాతం పెంచారు. అంటే మొత్తమ్మీద ధరలు 75 శాతం పెరిగాయన్న మాట. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. పెరిగిన ధరలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
కొత్త ధరల ప్రకారం క్వార్టర్ రూ. 120 వరకు ఉన్న మద్యం ధర మరో రూ. 40 పెరిగింది. క్వార్టర్ రూ. 120 నుంచి రూ. 150 వరకు ఉన్న మద్యం ధర రూ. 80 పెరిగింది. రూ. 150 కంటే ఎక్కువ ఉన్న ధర మరో రూ. 120 పెరిగింది. చిన్న బీరు ధర రూ. 40, పెద్ద బీరు ధర రూ. 60 పెంచారు.
.