Vijay Devarakonda: దక్షిణాదిలో విజయ్ దేవరకొండ అరుదైన రికార్డు

Vijay Devarakonda gets highest number of followers in Instagram
  • ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా గుర్తింపు
  • ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్లు
  • రెండేళ్ల కిందట ఇన్ స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన విజయ్
టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ముందువరుసలో ఉంటాడు. 'పెళ్లి చూపులు' చిత్రంతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న విజయ్ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అక్కడ్నించి వెనుదిరిగి చూడాల్సిన అవసరంలేకపోయింది. గీతగోవిందం, మహానటి, టాక్సీవాలా వంటి చిత్రాలతో స్టార్ డమ్ మరింత పెంచుకున్నాడు.

ఇప్పుడు విజయ్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. దక్షిణాదిన ఎక్కువమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అవతరించాడు. మరే హీరోకి లేనంతగా విజయ్ కు 70 లక్షలకు పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతజేసీ విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించింది రెండేళ్ల కిందటే. అయినప్పటికీ ఇతర హీరోలకు సాధ్యం కాని రీతిలో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. కాగా, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించేందుకు విజయ్ దేవరకొండకు ప్రత్యేక బృందం ఉంది.
Vijay Devarakonda
Instagram
Followers
South India
Record

More Telugu News