Pranitha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Pranitha in two Hindi films
  • బాలీవుడ్ చిత్రాలలో ప్రణీత 
  • 'లూసిఫిర్'లో సల్మాన్ లేడట!
  • కమల్ స్థానంలో విజయ్ సేతుపతి  
 *  తెలుగులో గతంలో కొన్ని చిత్రాలలో నటించిన కన్నడ భామ ప్రణీత ఇప్పుడు హిందీలో బిజీగా వుంది. దీని గురించి ప్రణీత చెబుతూ, 'బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. అజయ్ దేవగణ్ తో ఒక సినిమా, ప్రియదర్శన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను. తెలుగు నుంచి మంచి ఆఫర్లు రావడం లేదు వస్తే కనుక చేస్తాను' అని చెప్పింది.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫిర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తాడంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, అసలు సల్మాన్ ను అనుకోలేదని యూనిట్ సభ్యులు తెలిపారు.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నాడు. కమల్ హీరోగా ఆయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ 'తలైవాన్ ఇరుక్కింద్రాన్' పేరిట ఓ చిత్రాన్ని ప్లాన్ చేసింది. అయితే, తాను నటిస్తూ దర్శకత్వం చేయడం తలకుమించిన భారం అవుతుందన్న ఉద్దేశంతో కమల్ ఇందులో నటించకుండా కేవలం దర్శకత్వం వహించడానికే నిర్ణయం తీసుకున్నాడట. దాంతో హీరో పాత్రకు విజయ్ సేతుపతిని తీసుకున్నట్టు సమాచారం.
Pranitha
Ajaydevagan
Chiranjeevi
Kamal Hassan

More Telugu News