American Children: అంతుచిక్కని అనారోగ్యం బారినపడుతున్న అమెరికా చిన్నారులు!
- 2-15 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల్లో కనిపిస్తున్న లక్షణాలు
- నరాల వాపు, వాంతులు, పొత్తికడుపులో నొప్పి
- ‘మిస్టీరియస్ సిండ్రోమ్’గా భావిస్తున్న వైద్యులు
కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాలో ఇప్పుడు మరో కలకలం రేగింది. రెండేళ్ల నుంచి 15 ఏళ్ల లోపు మధ్య వయసున్న చిన్నారులు అంతుచిక్కని అనారోగ్యం బారినపడుతున్నారు. వీరిలో చాలామంది కరోనా నుంచి కోలుకున్న వారే కావడం గమనార్హం. వైద్యులు దీనిని ‘మిస్టీరియస్ సిండ్రోమ్’గా చెబుతున్నప్పటికీ అదేమిటనే దాని విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు.
ఈ అంతుచిక్కని అనారోగ్యానికి గురవుతున్న చిన్నారుల్లో రక్తనాళాల్లో వాపు, పొత్తికడుపులో నొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ సోకిన చిన్నారుల్లోనే ఈ లక్షణాలు కూడా బయటపడుతుండడంతో వైద్య నిపుణులు దీనిని కోవిడ్ సంబంధిత వ్యాధిగానే భావిస్తున్నారు. ఇటీవల బ్రిటన్ చిన్నారుల్లోనూ ఇలాంటి లక్షణాలే బయటపడగా, ఆ తర్వాత ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, స్విట్జర్లాండ్, బెల్జియంలోనూ ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది.