Yuvaraj Singh: యువరాజ్ సింగ్ ను వెన్నుపోటు పొడిచిన ధోనీ, కోహ్లీ: యోగ్ రాజ్

Yuvaraj Singh Sensational Comments on Dhoni and Kohli
  • కెరీర్ కష్టకాలంలో ఉన్న వేళ మద్దతివ్వలేదు
  • నాకు చాలా బాధ కలిగింది
  • యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలు, తన కుమారుడు యువరాజ్ సింగ్ ను వెన్నుపోటు పొడిచారని యోగ్ రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువీ కెరీర్ కష్టకాలంలో ఉన్న వేళ, వీరిద్దరూ అండగా నిలిచేందుకు ముందుకు రాలేదని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ తండ్రి ఆరోపించారు. ఇది తనకు చాలా బాధను కలిగించిందని, అప్పట్లో సెలక్టర్ శరణ్ దీప్ కూడా తన కుమారుడిని జట్టు నుంచి తప్పించాలని చూశాడని ఆరోపించారు.

కాగా, యోగ్ రాజ్ ఇలా ధోనీ, కోహ్లీలపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. 2011 వరల్డ్ కప్ సమయంలో యువరాజ్ స్థానంలో రైనాను తీసుకోవాలని ధోనీ చూశాడని గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. యువరాజ్ రాణిస్తే, తమ స్థానాలకు ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో వారు ఉండేవారని అన్నారు. తనపట్ల కొందరు ఆటగాళ్లు వివక్ష చూపించేవారని, గంగూలీ మాత్రం తనకు ఎంతో మద్దతుగా నిలిచారని యువరాజ్ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Yuvaraj Singh
Yograj Singh
MS Dhoni
Virat Kohli
Gangooly

More Telugu News