Kim Jong Un: బహిరంగంగా కనిపించింది నకిలీ కిమ్?... సాక్ష్యాలు చూపిన బ్రిటన్ మాజీ ఎంపీ!

News Viral on Kim Jong un Dupe

  • 20 రోజులు కనిపించని ఉత్తర కొరియా అధ్యక్షుడు
  • కిమ్ పళ్ల వరుసలో తేడా వుంది
  • ఫొటోలు పోస్ట్ చేసిన లూయిస్ మెన్స్

దాదాపు 20 రోజులుగా కనిపించకుండా పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, గత వారం చివరిలో ఓ ఫర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవంలో కనిపించగా, ఆ కార్యక్రమానికి వచ్చింది అసలు కిమ్ కాదని, ఆయన డూప్ అని కొందరు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

కిమ్ జాంగ్ పాత ఫొటోలను, తాజా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తేడాలను చూపిస్తున్నారు. బ్రిటన్ మాజీ ఎంపీ లూయిస్ మెన్స్, గతంలోని కిమ్ చిత్రాన్ని, మొన్నటి చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, పాత కిమ్ పళ్ల వరుసకు, కొత్త కిమ్ పళ్ల వరుసకూ తేడా కనిపిస్తోందని చెప్పడంతో, ఈ విషయం వైరల్ అయింది. ఆయన హెయిర్ స్టయిల్ కూడా మారిందని అన్నారు.

కాగా, పలువురు దేశాధినేతలు... ముఖ్యంగా హిట్లర్, సద్దామ్ హుస్సేన్ వంటి వారు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు తమ నకిలీలలను పంపేవారన్న సంగతి తెలిసిందే. కిమ్ కూడా అలాగే భద్రతాపరంగా తనను పోలివుండే ఐదుగురిని వినియోగిస్తారని, ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తే, వారిలో ఒకరిని పంపిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కిమ్ కు ఆపరేషన్ జరిగిందని, ఆయన ఆరోగ్యం క్షీణించి అంపశయ్యపై ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బాగానే ఉన్నారని తెలియగానే, ఈ 'డూప్' వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News