Vizag Gas Leak: విశాఖలో విషవాయువు లీకైన ఘటనలో 11కి పెరిగిన మృతుల సంఖ్య

Death toll raises in Vizag gas leak incident

  • ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీక్
  • 200 మంది చికిత్స పొందుతున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ డీజీ వెల్లడి
  • విశాఖలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వివరణ

విశాఖలో ఈ వేకువ జామున ఎల్జీ పాలిమర్స్ అనే పరిశ్రమ నుంచి లీకైన విషవాయువు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయచర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ వివరాలు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టిరీన్ గ్యాస్ లీకైన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 11కి పెరిగిందని వెల్లడించారు.

ఈ విషవాయువు ప్రభావానికి గురైన 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని, 80 మందికి పైగా వెంటిలేటర్లపై ఉన్నారని ఎన్డీఆర్ఎఫ్ డీజీ తెలిపారు. సహాయక చర్యల్లో భాగంగా 500 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. విశాఖలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News