CPI Narayana: ‘ఎల్జీ పాలిమర్స్’ అనుమతులు రద్దు చేయాలి: సీపీఐ నారాయణ డిమాండ్
- విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై నారాయణ స్పందన
- కాలుష్య నియంత్రణ మండలి అధికారులను సస్పెండ్ చేయాలి
- యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలి
విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజ్ ఘటనపై సీపీఐ నారాయణ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన సంస్థ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. దేశంలో ‘పెట్రో’ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ‘కరోనా’, లాక్ డౌన్ ల నేపథ్యంలో రేషన్ కార్డులున్నా, లేకున్నా ప్రతి వ్యక్తికి రూ.10 వేల నగదు, 20 కిలోల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కరోనా’ కట్టడికి భౌతికదూరం పాటించాలన్న మోదీ ప్రభుత్వం, రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులివ్వడం ద్వారా ఆ నిబంధనలను తుంగలో తొక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.