West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో గాలి కలుషితం.. కళ్లమంటలతో జనం అవస్థలు!
- ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఘటన
- అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది
- సాగునీటి కాలువలోకి వదిలిన వ్యర్థాల వల్లేనంటున్న స్థానికులు
పశ్చిమ గోదావరి జిల్లాలో గాలి కలుషితం కారణంగా ప్రజలు కళ్లమంటలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి సమీపంలోని ప్రజలు ఒక్కసారిగా కళ్లమంటలతో అల్లాడిపోయారు.
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటన నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. గాలిలో కలుషితం వల్లే కళ్లు మండుతున్నట్టు గుర్తించారు. ఏలూరు సాగునీటి కాలువలోకి వదిలిన వ్యర్థాల వల్లే గాలి కలుషితం అయిందని స్థానికులు మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.