Franklin Templeton: సెబీకి క్షమాపణలు చెప్పిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
- ఆరు డెట్ ఫండ్స్ ను మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
- ఇబ్బంది కలిగితే క్షమించాలని వ్యాఖ్య
- ఇన్వెస్టర్లకు ఇబ్బంది కలగనివ్వం
క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి అమెరికా సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ క్షమాపణలు చెప్పింది. మూడు వారాల క్రితం ఆరు డెట్ ఫండ్స్ ను మూసి వేయడంపై ఆ సంస్థ స్పందించింది. తమ నిర్ణయంతో సెబీకి ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కోరింది. ఇన్వెస్టర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఇన్వెస్టర్ల పెట్టుబడి చెల్లిస్తామని తెలిపింది.
కరోనా భయాలతో ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులను ఇన్వెస్టర్లు భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు డెట్ ఫండ్స్ ను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మూసేసింది. ఈ నిర్ణయం మార్కెట్లను కుదిపేసింది. మ్యూచువల్ ఫండ్స్ రంగం షేక్ అయింది. దీంతో, ఆర్బీఐ రంగంలోకి దిగి రూ. 50 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చింది.