Vizag: మృతదేహాలతో ఎల్జీ పాలిమర్స్‌ గేటు వద్దే స్థానికుల ఆందోళన.. బయటకు రాలేకపోతోన్న డీజీపీ గౌతం సవాంగ్

  • గ్యాస్ లీక్‌ ప్రాంతాన్ని పరిశీలించిన డీజీపీ
  • గేటు వద్ద బైఠాయించిన స్థానికులు
  • డీజీపీకి రక్షణ వలయంలా ఏర్పడిన పోలీసులు

విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఆ పరిశ్రమ వద్దకు చేరుకున్న డీజీపీ గౌతం సవాంగ్ గ్యాస్‌ లీకైన ప్రాంతాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన బయటకు వెళుతుండగా, గేటు గుండా ఆందోళనకారులు లోపలికి దూసుకురావడానికి ప్రయత్నించారు. న్యాయం చేయాలని గౌతం సవాంగ్‌ను కోరుతున్నారు. పరిశ్రమ గేటును తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

పరిశ్రమ గేటు వద్దే మృతదేహాలతో వారు ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గేటు వద్దే ఆందోళనకారులు బైఠాయించడంతో డీజీపీ లోపలే ఉండిపోయారు. డీజీపీ చుట్టూ రక్షణ వలయంలా పోలీసులు నిలబడ్డారు. పరిశ్రమలోకి రాకుండా స్థానికులను అడ్డుకుంటున్నారు. సంయమనం పాటించాలని పోలీసులు విజప్తి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News