Uttam Kumar Reddy: ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొనాలి.. కరోనా పరీక్షలు ఎక్కువగా చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయట్లేదు
- ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది
- తక్కువ పరీక్షలు చేయడం సరికాదు
తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తుండడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. 'కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో ఎందుకు చేయడంలేదని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తక్కువ పరీక్షలు చేయడం, తక్కువ కేసులు చూపెట్టడం ప్రజలను ఫూల్స్ చేయడమేనని కోర్టు చెప్పింది. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొనాలి. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలి' అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ట్వీట్ చేశారు.
కరోనా పరీక్షలను తగినంత మేరకు ఎందుకు జరపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించిందంటూ వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తామని చెప్పడం సరైన విధానమేనా? అని నిలదీసిందని అందులో ఉంది.