Pawan Kalyan: అమిత్ షాపై ఇలాంటి పుకార్లు రావడం విచారకరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on rumors about Amit Shah health

  • అమిత్ షాకు అనారోగ్యం అంటూ ప్రచారం
  • అవి పుకార్లేనని కొట్టిపారేసిన అమిత్ షా
  • ఇది బాధాకరమైన విషయం అంటూ పవన్ ట్వీట్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బోన్ క్యాన్సర్ అంటూ పుకార్లు రావడం పట్ల తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ఓ జాతీయ మీడియా సంస్థ కూడా అమిత్ షా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారన్నది వట్టి ఫేక్ న్యూస్ మాత్రమేనని స్పష్టం చేసింది. అటు, అమిత్ షా స్వయంగా ఈ విషయాన్ని ఖండించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ అంశంపై జనసేన పార్టీ చీఫ్, బీజేపీ మిత్రుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అమిత్ షాపై ఇలాంటి పుకార్లు రావడం బాధాకరమని పేర్కొన్నారు. అమిత్ షాపై ప్రచారంలో ఉన్న పుకార్లలో నిజంలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News